Graduate MLC: బ్లాక్ మెయిల్ రాజకీయాలు.. ప్రభుత్వానికి బాకా ఊదే వ్యక్తిని కాకుండా గోల్డ్ మెడలిస్ట్ ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇద్దరు మోసగాళ్లను ఓడించాలని కోరారు.
Also Read: Kalyana Lakshmi: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తులం బంగారం పంపిణీ ఆరోజు నుంచే..
ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భువనగిరి జిల్లా ఆలేరులో ఆదివారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పట్టభద్ర ఓటర్ల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పేరు ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జర్నలిజం ముసుగులో బ్లాక్మెయిల్ కార్యక్రమాలు చేస్తున్నాడని తెలిపారు. బాకాలు ఊదే అతడిని కాదని రాకేశ్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
Also Read: Narendra Modi: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల సిద్ధాంతం బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ.. ఆఫ్ ద ఫ్యామిలీ
రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసాలు వివరిస్తూ కేటీఆర్ ప్రజలను ఆలోచించాలని సూచించారు. 'డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసిన వ్యక్తిని శిక్షించాలా? వద్దా? రైతులు బిడ్డలు ఆలోచించాలి. రైతులు నాట్లు వేసే నాడు కాకుండా రైతులు ఓట్లు వేసే నాడు రైతుబంధు వేస్తున్నారు. ఇప్పటికీ కూడా రైతుల ధాన్యం కొంటలేరు. రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఐదు నెలల్లోనే రాష్ట్ర రైతాంగం మొత్తం ఆగమాగమయ్యే పరిస్థితి తెచ్చారు. రైతు కూలీలు, కౌలు రైతులు, ఆటో డ్రైవర్లు ఇలా అన్ని వర్గాలకు సాయం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి కారణంగా 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయి. వాళ్ల సమస్యలను ప్రశ్నించే వాళ్లు ఉండాలా? లేదంటే బ్లాక్ మెయిల్ దందాలు చేసేటోళ్లు ఉండాలా?. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గల్లా పట్టి నిలదీసేందుకు రాకేష్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి' అని కోరారు.
లేరులో మంచి పనులు చేసినప్పటికీ స్వల్ప తేడాతో ఓడిపోయాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వనంత ఎక్కువ జీతం మనమే ఇచ్చాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మనకు దూరమయ్యే విధంగా కొందరు యూట్యూబ్‌లో ప్రచారం చేశారు. పదేళ్లలో కేసీఆర్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. దేశంలోనే ఇలా ఉద్యోగాలు ఇచ్చిన మొనగాడు ఉన్నాడా అంటే సమాధానం లేదు. కానీ రాహుల్ గాంధీ, మోడీ కుక్కలు మాత్రం ఇక్కడ తప్పుడు మొరుగుడు మొరిగాయ్. రేవంత్ రెడ్డి వచ్చినంక 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. మంది పిల్లలను మా పిల్లలు అని చెప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది' అని కేటీఆర్ మండిపడ్డారు.
ఇచ్చిన హామీలను గల్లా పట్టి అడిగేటోళ్లు ఉండాలి. రేవంత్ రెడ్డికి బాకా ఊదేవాళ్లు కాదని కేటీఆర్ పేర్కొన్నారు. 'రేవంత్ రెడ్డి మహిళలకు రూ.2,500, పెద్ద మనుషులకు రూ.4 వేలు అన్నాడు ఎవరికైనా వచ్చాయా?' అని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా రాహుల్, ప్రియాంక గాంధీలు మహిళలకు రూ.2,500 ఇస్తున్నామని చెబుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి, ఇక్కడి జిల్లా మంత్రి రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతానన్నారు. ఇలాంటి తప్పుడు నా కొడుకులను మనమే చెప్పుతో కొట్టేలా సమాధానం చెప్పాలి' అని సూచించారు.
హామీలు అమలు చేయకుండా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తుంటే చదువుకున్న వ్యక్తులు కూడా మాట్లాడకుండా ఉందామా?. ఆలేరులో కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అసలు మనం చేసిన పనిని చెప్పుకోలె. కానీ బీజేపోళ్లు తక్కువ పని చేసి.. ఎక్కువ చెప్పుకున్నారు' అని కేటీఆర్ తెలిపారు. అయోధ్య విషయంలో బీజేపీ ప్రచారం చేసుకున్నంత యాదాద్రిపై ప్రచారం చేసుకోలే అని చెప్పారు. మోసం చేసిన మోడీని.. ఇక్కడి కేడీ అబద్దాలను గ్రాడ్యుయేట్లకు తెలపాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 'నల్లధనం, రైతుల ఆదాయం డబుల్, బుల్లెట్ రైళ్లు అని ఎన్ని చెప్పిండు మోడీ. నల్లధనం ఏదంటే తెల్లమొఖం వేసుకున్నాడు మోడీ. పదేళ్లు ప్రధానిగా ఉండి ఏం చేశావంటే పది నిమిషాలు కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. ఏమన్న అంటే హిందూ-ముస్లిం పంచాయితీ.. గుడి కట్టాం అనటమే తప్ప చేసిందేమీ లేదు' అని అసహనం వ్యక్తం చేశారు.
పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విషయమై కేటీఆర్ మాట్లాడుతూ.. 'రైతు కుటుంబంలో పుట్టి బిట్స్ పిలానీలో చదువుకొని రాకేశ్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేశారు. ఎంతో సంపాందించే అవకాశం ఉన్నా ప్రజాసేవ కోసం ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ వైపు చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు. కాంగ్రెస్ వైపు ఎలాంటి వ్యక్తి ఉన్నాడో మీకే తెలుసు' అని పేర్కొన్నారు. శాసనమండలిలో చదువుకున్న వ్యక్తి ఉండాలి కాని బ్లాక్‌మెయిలర్ కాదు అని తీన్మార్ మల్లన్న గురించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతుక రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter